23, ఏప్రిల్ 2012, సోమవారం

మగవారికి పెద్ద హెల్ప్ చేస్తున్నాను

అందరికీ నమస్కారములు,
చాలా రోజుల తర్వాత బ్లాగుతున్నాను.
మగవారికి ఒక విషయం చెబుదామని రాస్తున్నాను.(హెల్ప్ చేస్తున్నాను)
మీరు షాప్ కి వెళ్లి ఇవ్వకుండా, అతను వారం రోజుల తర్వాత రండి అనకుండా, ఈలోపుగా మీ శ్రీమతి తిట్టకుండా మీకు ఒక ఉపాయం చెబుతున్నాను.  రడీ.........
ఇంట్లో ఒక కరెంట్   రైస్ కుకర్ వుంది కదా. అది పని చేయక పొతే మీరు గబా గబా షాప్ కి వెళ్ళకుండా ఒక సారి కింది భాగం లోని స్క్రూస్ విప్పండి. ఎలా విప్పారో గుర్తు కూడా ఉంచుకోండి. మళ్ళీ  టైట్ చేయడానికి వీలుగా.
లోపల కొన్ని వైర్స్ వుంటాయి అవి ఫిట్ చేసి వున్నాయో లేదో చూడండి. విడిపోయి వుంటే జాయింట్ చేయండి. అంటే మళ్ళీ అన్నీ క్లోస్ చేసి స్క్రూ పెట్టేయండి. ఓ కే. ( మంచి గా ఉన్నప్పుడే లోపలి భాగాలను ఒక చిన్నపాటి వీడియో కూడా తీసుకొని ఉంచుకోండి ఎందుకైనా మంచిది). నా కుకర్ నేనే ఎన్నోసార్లు బాగు చేసుకున్నాను. ఒక్క వైర్ తెగిపోతే కొత్తది కొనుక్కోండి అని షాపు అతను చెప్పగానే కొత్తది కొనేవారు చాలా మంది వున్నారు లోకం లో. నాకు ఒకసారి అలాంటి వారు ఎదురయ్యారు. (పెద్ద రిపేర్ అయితే మాత్రం..........)

ఇంకొకటి కూడానా! సరే వినండి.
గ్యాస్ స్టవ్ బర్నర్ సరిగ్గా మండకుంటే.................ఇలా చేయండి. ఏంటంటే.......

2 కామెంట్‌లు:

  1. .................ఇలా చేయండి. ఏంటంటే.......
    ...............................................
    అంటే ఇలా .... చుక్కలు పెడితే బర్నర్ బాగవుతుందా?

    రిప్లయితొలగించండి
  2. హ హ హ ముందుగా.మీ సెన్స్ అఫ్ హ్యుమర్ కి నా జోహార్లు.
    స్టవ్ ఇబ్బంది ఐతే అడుగుతారనుకున్నాను. కానీ అందరి స్టవ్ లు బాగున్నట్టున్నాయండి.

    రిప్లయితొలగించండి