15, డిసెంబర్ 2012, శనివారం

నా పాట వింటారా ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ

నేను పాడిన ఈ పాట ఎలా వుందో విని కాస్త  చెప్పగలరు.
విని పారిపోకండి. శృతి,తాళం లు తెల్వవు. సంగీతం  వచ్చిన వారు కాస్త ఓపికతో భరించగలరు.




28, జూన్ 2012, గురువారం

టి.వి.

                

 టి.వి. వల్ల  వాళ్ళ ఇంట్లో వచ్చిన గొడవలను నాకు ఈరోజు ఒక ఆవిడ చెప్పింది. మనస్థాపాలు.

                 టి.వి లేకుంటే జనాలు ఇంత  చెడిపోయే వారు కాదేమో అనిపిస్తుంది నాకు.  మనలో చాలా మందికి చెడు ఆలోచనలు లేవు.  టి.వి. లేకుంటే  కుటుంబాలు విడిపోవడానికి  ఇంక కొన్ని సం. పట్టేదేమో. తెలుగు లో వచ్చే సీరియల్స్ అన్నీ దాదాపు కుటుంబాన్ని ఎలాగా విడదీయాలో  రకరకాల  ఆలోచనలు  ( అసలు అటువంటివి రావు) రేకెత్తించేలా, ప్రేరేపించేల చేస్తున్నై. ఎవ్వరినైనా, ఏమైన, ఎక్కడైనా అనొచ్చు అనేలా ఉంటున్నాయి. చాలా దారుణంగా వున్నై కొన్ని సీరియల్స్ . నేను  రెగ్యులర్ గా  టి.వి. చూడను.  వంట చేస్తూ మాటలు వింటుంటాను.       ఒక్క పాడుతా తీయగా, హిందీ పాత పాటలు  తప్ప.
                          కుటుంబాలను ఎలా కలపొచ్చో మాత్రం ఎవ్వరికీ అస్సలు తెలవదు లాగా వుంది. ఆ దిశ గా ఎలా మాట్లాడాలో ఎవ్వరూ చెప్పరు. కోపం ,ఆవేశం మొ. అర్ధాలు మాత్రం బాగా తెలుసు. కరుణ, సౌమ్యం , లాలన, ఓపిక అంటే  ఎగిరి పడతారు. చులకనగా చూస్తారు.
                            హిందీ సీరియల్స్ కుటుంబాలు గా ఉండడానికి ఇష్టపడతాయి. ఆ దిశగా సీరియల్స్ ను నడిపిస్తాయి. నాకు నచ్చుతాయి.
                 బై....

7, జూన్ 2012, గురువారం

నవ్వకండి ఇది చదివి.

నవ్వకండి ఇది చదివి.                నాకు తోచిన విధంగా  చేసాను మరి.
సంసారం కదా. ఆ మాత్రం పొదుపుగా , తెలివిగా , ఆలోచన గా  వుండాలనీ , ఇంకా గడుసుగా కూడా వుండాలనీ "మావిడాకులు"   సినిమాలో ఆమని చెప్పింది.   పాటించాను.
మీకు స్టవ్ రిపేర్ ఎలా చేయాలో చెబుతాను అన్నాను కదా. మీ స్టవ్ లు  అన్ని బాగా వున్నాయేమో మరి గుడ్.
బాగా లేనివారికి,,,,,,,,
బర్నర్స్ సరిగ్గా లేక విసిగిస్తుంటే  నేను మాత్రం ఇలా చేసాను. మాకు సైకిల్ కి గాలి కొట్టే పంప్ ఇంట్లో వుంది. దాన్ని స్టవ్ కి అటాచ్ చేసి పంపింగ్ చేసాను. క్లీన్ ఐ పోయాక స్టవ్ ఆన్ చేస్తే చాలా బాగా వెలిగింది. మీరూ అలాగే చేయండి.

బై

23, ఏప్రిల్ 2012, సోమవారం

మగవారికి పెద్ద హెల్ప్ చేస్తున్నాను

అందరికీ నమస్కారములు,
చాలా రోజుల తర్వాత బ్లాగుతున్నాను.
మగవారికి ఒక విషయం చెబుదామని రాస్తున్నాను.(హెల్ప్ చేస్తున్నాను)
మీరు షాప్ కి వెళ్లి ఇవ్వకుండా, అతను వారం రోజుల తర్వాత రండి అనకుండా, ఈలోపుగా మీ శ్రీమతి తిట్టకుండా మీకు ఒక ఉపాయం చెబుతున్నాను.  రడీ.........
ఇంట్లో ఒక కరెంట్   రైస్ కుకర్ వుంది కదా. అది పని చేయక పొతే మీరు గబా గబా షాప్ కి వెళ్ళకుండా ఒక సారి కింది భాగం లోని స్క్రూస్ విప్పండి. ఎలా విప్పారో గుర్తు కూడా ఉంచుకోండి. మళ్ళీ  టైట్ చేయడానికి వీలుగా.
లోపల కొన్ని వైర్స్ వుంటాయి అవి ఫిట్ చేసి వున్నాయో లేదో చూడండి. విడిపోయి వుంటే జాయింట్ చేయండి. అంటే మళ్ళీ అన్నీ క్లోస్ చేసి స్క్రూ పెట్టేయండి. ఓ కే. ( మంచి గా ఉన్నప్పుడే లోపలి భాగాలను ఒక చిన్నపాటి వీడియో కూడా తీసుకొని ఉంచుకోండి ఎందుకైనా మంచిది). నా కుకర్ నేనే ఎన్నోసార్లు బాగు చేసుకున్నాను. ఒక్క వైర్ తెగిపోతే కొత్తది కొనుక్కోండి అని షాపు అతను చెప్పగానే కొత్తది కొనేవారు చాలా మంది వున్నారు లోకం లో. నాకు ఒకసారి అలాంటి వారు ఎదురయ్యారు. (పెద్ద రిపేర్ అయితే మాత్రం..........)

ఇంకొకటి కూడానా! సరే వినండి.
గ్యాస్ స్టవ్ బర్నర్ సరిగ్గా మండకుంటే.................ఇలా చేయండి. ఏంటంటే.......