23, డిసెంబర్ 2011, శుక్రవారం

*************************తిట్లు కూడా సూపర్ గా తింటున్నారు.

             షాప్ నుండి ఇంటికి చేరే సరికి అలసిపోయాను. అప్పుడే  టి.వి లో ఏదో సూపర్ అని అందులోనవదీప్ఇంకా టి.వి.యాక్టర్లు కనబడ్డారు.   కాసేపు కూర్చొని కళ్ళు మూసుకున్నాను.  మాటలే వింటున్నాను. అందులో ఎవరినో ఎంకరేజ్ చేస్తున్నాడు. అయినా ఆమె ఓడిపోయినట్టుంది.  ఇక ఒకటే తిట్లు. ఆమె ఫీల్ అవుతుంది. మిగతా వాళ్ళు కూడా వీలైనంత ఫీల్ అవుతున్నారు.  నాకు కంపరంగా వుంది.
              ఆ తిట్లు ఇంట్లో అమ్మ నాన్న  అక్క అన్న వాళ్ళు  తిడితే ఒకటికి వంద సార్లు అస్సలే ఊరుకోరు.  అలుగుతారు. సాధిస్తారు. బెదిరిస్తారు. అదే నవదీప్ ఎన్ని తిట్లు తిట్టినా వూరుకుంటున్నారు. అంత  అవసరం ఉందా?  అది ఎలాంటి షో ఐనా సరే. మనసుకు  అంతగా నచ్చిందా? చేయను అని అనలేరా? ఐనా వాళ్ళును తిట్టే అంత అర్హత  ఈయనకు ఉందా?
"ఇన్ని మాటలు నేను పడను. మా ఇంట్లో వాళ్ళు అంటేనే పదను. వీడు అంటే పడతానా?  ఈ ప్రోగ్రామ్లో నేను పార్టిసిపేట్ చేయను"  అని ఎవరైనా అంటున్నారా? లేదు. 
ఆ డ్రెస్సింగ్ ఏంటో. నాకు అస్సలే నచ్చలేదు.  అంతా ఇంగ్లీష్ లోనే మాటలు. మాతృభాష ఐనట్టు. ఒక్కళ్ళకు
కూడా రోషం అనేది లేదు. అతనితో మాటలు పడితేనే  అన్నం దొరుకుతుందేమో పాపం.
ఇంతతిట్టినా నాకు సరిపోవట్లేదు. ఇంకా తిట్టాలనివుంది.
ఇక మొగిలిరేకులు సీరియల్ సెల్ ఫోన్  లేందే  అస్సలంటే  అస్సలు సాగదు. గమనించారా?
నాకు నచ్చినది ఒకే ఒకటి. పాడుతా తీయగా.   బాలసుబ్రహ్మణ్యం    చెప్పే  విషయాలు  ఇంకా  ఎవరితో  వింటాము? ఎవరు చెప్తారు అన్ని విషయాలు   అని ఆలోచేస్తే  ఎవ్వరూ  కనబడటం  లేదు. మీకు  కనబడుతున్నారా   ?






21, అక్టోబర్ 2011, శుక్రవారం

నానానానానానానానానానానానానానానా...............................రోడియో

నేను కొత్తగా  పెట్టిన  జిరాక్స్ షాప్  లో  కూర్చున్నాను. ఎదురుగా నా మెరూన్ రోడియో. ముద్దొస్తుంది. ఏ పరిస్థితులలో కొన్నాను? ఎన్ని రోజులకు కొన్నాను? ఎంత కష్టం అనుభవించాను?  నాకే తెలుసు. క్లుప్తంగా.....
         కాలేజ్ కి రోజూ ఆటోలో  వెళ్లి నడిచి  వచ్చేదాన్ని. ఒక పూట ఖర్చు ఆదా అని. ఆడ వాళ్లకి ఇదో పెద్ద రోగం. 1  రూపాయ  కూడా ఆదా కావాలనే కోరుకుంటాము. "కావాలంటే ఆటో డబ్బులు ఇస్తాను కాని. నన్ను మాత్రం దించమనకు అంటారు." మా వారు.
         ఇట్లా అంటారా అని తెగించి పోనూ, రానూ ఆటో లో తిరిగాను. ఐనా  ఆటో అతనికి రోజూ 40 రూపాయలు ఇవ్వడం నాకు అస్సలు నచ్చలే. స్కూటీ మీద వెళ్ళే ఆడవాళ్ళని చూస్తుటే నాకు ఎప్పుడు బండి కొంటానో. ఎప్పుడు కాలేజ్ కి వెళ్తానో........
            "ఏమండీ నాకు బండి కొనివ్వరా! ప్లీజ్ "  అన్నాను. "ముందు బండి ఎట్లా నడపాలో నేర్చుకో తర్వాత కొనిస్తాను."  అన్నారు. హమ్మయ్య కొనిస్తాను అని ఐతే అన్నారు అని సంతోషపడ్డాను. . "మరి నేర్పించడానికి బండి ఎవరు ఇస్తారు అండీ?" అన్నాను. "ఏమో అదంతా నాకు తెలవదు"  అన్నారు. 
         ఇక బండి ఎవరు ఇస్తారు అని వెదుకులాట. ఐనా ఎవరైనా నేర్చుకోవడాని కి ఎందుకిస్తారు? చెడిపోదా? నేనైతే ఇస్తానా? ( ఇచ్చి మోసపోయాను. మొహమాటం కదా. అది వేరే కథ ).
ఐనా ఒక మంచి ఫ్రెండ్ నాకు ఇచ్చింది. నాకు బాలన్స్ చేయడం రాక నేర్చుకోలేకపోయాను. హతవిధీ ఎలా ఎలా  ఎలా....
          నేను కొనే నా బండి తోనే నేర్చుకుంటాను అది ఎన్ని  నెలలైనా సరే అనుకున్నాను. "బండి ఎలా బాలన్స్ చేస్తావు? మోయలేవు."  అనేసరికి "ఏమండీ హెలికాప్టర్ నడిపేవారు దాన్ని మోస్తారా?" అన్నాను. "ఏమో చిన్నీ ఇక నీ ఇష్టం" అన్నారు. 
       పిల్లలు ఏదైనా తెమ్మంటే ఆటో లేదా నడిచి. నాకు విసుగు వచ్చేసింది. నా వాలకం చూసి అందరూ  ఏంటి అస్థిపంజరం లాగా అయ్యావు? అనడం మొదలుపెట్టారు. అమ్మ నా అవస్థ గమనించి డబ్బులు నేను కొన్ని పెట్టుకుంటాను ఏదైనా బండి కొనుక్కో అంది. చాలా రోజులు ఆలోచించాను. అదనంగా ఖర్చు అనుకున్నాను. కాని నేను పడే ఇబ్బందులముందు అవి చిన్నవిగా కనపడ్డాయి. 
          ఇక బండి కోసం.   ఏది కొనాలి.     ఎంతలో కొనాలి. ఎన్నో  రకాల వెహికిల్స్ చూసాను. మధ్యతరగతి కదా. చాలా ఆలోచించాల్సి వచ్చింది. మొత్తానికి రోడియో కొన్నాను. డబ్బులు ఎక్కువే అయ్యాయి.  షేరింగ్ కదా.  కొన్నాను. 15 రోజులు బండి ఇంట్లోనే పెట్టాను. మా వారు ఆఫీస్ బిజీ.         వెనుక కూర్చొని బాలన్స్ చేసే మగవారు ఎవరుంటారు?  స్టార్ట్ చేసిన బండిని పట్టుకోనేసరికి చేతులు వణికాయి. ఫస్ట్ టైం కదా. అలానే  2  రోజులు స్టాండింగ్ లో వుంచి స్టార్ట్  ప్రాక్టీస్ చేసాను. కాస్త భయం పోయింది. తర్వాత స్టాండ్ తీసివేసి బాలన్స్ చేసాను. హమ్మో ఎంత బరువో.
                  తర్వాత బయటికి తీసుకు వెళ్లి బ్రేక్ వేస్తూ ముందుకు ఫీట్ ఫీట్ మెల్లగా వెళ్ళాను. అప్పటికి 5 రోజులు ఐంది. సిమెంట్ రోడ్డు. తల పగులుతదేమో అని భయం. అలాగే ప్రాక్టీస్ చేసాను. ఇటు నుండి అటు. మళ్ళి కిందికి దిగి టర్న్ చేసి అటు నుండి ఇటు. నాకు డ్రైవింగ్ రానట్టే వుంది. భగవాన్ అనుకున్నాను.  కాని ఏదో తెగింపు మళ్ళీ. 
               ఒక రోజు మా ఆయనకు తీరికయ్యింది  ఎట్లనో..... "పద నేర్పిస్తాను" అన్నారు. వెనుక కూర్చున్నారు. స్టార్ట్ చేసాను. "కానీ ఎక్స్లేటర్ తిప్పు అన్నారు. "  చిన్నగా తిప్పానేమో  బండి ముందుకు పోలేదు. ఇంకా తిప్పాను. ముందుకు ఉరికింది. " వామ్మ్మోవాయ్యో" అంటూ మొత్తుకున్నాను. ఆయన బాలన్స్ చేసారు.         తీసుకెళ్ల లేక పోయాను. హాండిల్  అటు ఇటు వంకర టింకరగా  కదుల్తుంది. చేతులు, కాళ్ళు గజ గాజా వణుకుతున్నాయి  "వామ్మో దిగండి నా వల్ల కాదు బాబోయ్"   అన్నాను.     దేవుడా.......దేవుడా ......ఏంటయ్యా ఇలా జరుగుతుంది?.......
                "ఇక నీకు రాదు. ఇట్లా భయపడితే ఎట్లా" అన్నారు. "ఏం కాదు నాకు వస్తది.  నేను మిమ్మల్ని ఆఫీస్ కి డ్రాప్ చేసే రోజు తప్పక వస్తది." అన్నాను. "ఇట్లా భయ పడితే ఎన్ని నెలలకైనా నీకు రాదు" అన్నారు. "దేవుడా ఇంత దాక వచ్చినాక నాకీ పరీక్ష ఏంటి స్వామీ. తొందరగా నాకు డ్రైవింగ్  వచ్చేటట్టు చేయి స్వామీ" అని దండం  పెట్టు కున్నాను. 
          "ఒక రోజు నన్ను మా  కాలేజ్ కి నైట్ 9  కి తీసుకెళ్ల మని పోరు పెట్టాను. అక్కడ  నేర్చుకుంటాను" అన్నాను. "అక్కడికి ఎందుకు చిన్నీ? అందరూ వుంటారు అక్కడ" అన్నారు. "రాత్రి  ఎవ్వరూ వుండరు వేల్దామండీ " అన్నాను నామాట విని తీసుకెళ్ళారు.  ఆహా . నా కోరిక తీరింది.  పేద్ద గ్రవుండు. టర్నింగ్ లు   వుండవు.  చుట్టూరా తిరగొచ్చు.
అదీ నా ప్లాన్.   నా భయం పోయింది.  నేను అనుకున్నది జరిగింది. 
"ఏమండి నావెనుక  కూర్చోండి"  అన్నాను.
" ఏంటే అంత ధైర్యం వచ్చింది నీకు.  మీ కాలేజ్ కి రాగానే " అన్నారు. 
"ఏమనుకున్నారు మరి" అన్నాను.
కాళ్ళు వేలాదదీయమన్నాను. నేను కూడా అలాగే వేలాడదీసి   తిన్నగా కొంచం దూరం పోగానే కాళ్ళు పైకి పెట్టేసి నా ఇష్టం వచ్చినన్ని రౌండ్లు కొట్టాను. మా వారు కూడా "పెట్రోల్  పోయించాను నీ ఇష్టం వచ్చినన్ని సార్లు తిరుగు ఇక" అన్నారు. ఆహా గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అనుకుంటూ ఝామ్మని తిరుగుతూనే వున్నాను.  హుర్ర వచ్చేసింది.   వచ్చేసింది.    వచ్చేసింది.
కాలేజ్ కి వెళ్తుంటే                ఒహో 
              అలా బండి కొనడం, తిరగడం అవసరాలు  తీర్చుకొనడం, పిల్లలను స్కూల్లో దించి  రావడం బాక్స్ లు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో.  మా వారు  అప్పుడప్పుడు నన్ను డ్రాప్ చేసే పని కూడా తప్పించుకున్నారు. 

నా రోడియో ఐ లవ్ యు .

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

సంబంధ బాంధవ్యాలు

      నన్ను బ్లాగ్ లోకం లోకి రమ్మని మిత్రులు వ్రాస్తున్నారు. కాని 90 %  వెనకడుగు  తోనే వచ్చాను.  వారిప్రేరణతో............చిన్న అతిపెద్ద విషయం.  టి.వి.అంటే అతి  ఖసి తోవ్రాస్తున్నాను.
దయ చేసి టి.వి.చూడకండి.వాటిద్వార మీరు పొందిన లాభం ఎంతో రోజూ ఒక . పేపర్  మీద వ్రాయండి.
మన ఇంట్లో వాళ్ళతో గానీ, బయటి వాళ్ళతో గానీ ఎలా సంబంధాలు తెంపుకొవచ్చో  చాలా ఈజీ గ తెలుసుకోవాలంటే  ప్రతిరోజూ 24 గంటలు తెలుగు టి.వి.సీరియల్స్ ను చూడొచ్చు.  ఇది నిజం. అందరూ అంగీకరించాల్సిందే.  ఇదివరకు నాకు న్యూస్ పిచ్చి వుండేది. కాని ఇప్పుడు అది కూడా వదిలేసాను చూడ్డం.  నాకు టి.వి.అంటే పరమ రోత.  అది మనటైం ని అంతా  హరించివేస్తుంది.  వేరే ఆలోచనలు రాకుండా చేస్తుంది. భార్య భర్తల్లో ఎవరికీ టి.వి. పిచ్చివున్నా ఇంట్లో గొడవలే. నిద్ర లేకుండా చేసి రోగాలకు కారణ భూతం అవుతుది.  

     నా సీరియల్ ద్వారా ఒక మంచి విషయం చెప్పాలి  ఈ జెనరేషన్ కి అని  నిర్మాతలు గానీ దర్శకులు గానీఎవ్వరు కూడా ఆలోచించట్లేదు. చెడును వెరైటీగా  చెప్పడానికి మాత్రం  ఖర్చుకు వెనుకాడరు. అక్క తమ్ముడి తో, కొడుకు తల్లితో, భార్యతో భర్త, అత్తతో కోడలు, వదిన తో మరిది, బావతో మరదలు  కోడలుతో మామ  etc మధ్య మంచి మర్యాద అస్సలు చూపించరు.ఇప్పుడు ముద్దు బిడ్డ  సీరియల్ తో పిల్లలో కూడా విషం చిమ్ముతున్నారు. ఇది అందరం తప్పక ఖండించాల్సిన విషయం. లేకపోతే మనుషులు మృగాలు కావడానికి ఎక్కువ టైం పట్టాడు.

 పిల్లలకు దేనిలో ఉత్సాహంగా ఉంటారో తెలిసేది   సెలవు రోజుల్లో లో మాత్రమే. అది కూడా టి.వి. కి కేటాఇస్తున్నారు. 
 వారిలోని  సృజనాత్మకత బయట పడేది ఎప్పుడు?  వారికి సొంతగా తెలివిని  ఉపయోగించుకొనే టైం ఎక్కడిది? 

మా ఇంట్లో కూడావుంది e -pichchi . ఎవ్వరికీ తెలవకుండా నేను ఒక రోజు కేబుల్ వైర్ కట్  చేసాను.ఇక ఆ రోజు చూడాలి అందరు కాలు కాలిన పిల్లి లాగా ఆరాటం. ఎందుకు కేబుల్రావడం లేదు అని. నాకేమో నవ్వు ఆగడం లేదు. 
వీళ్ళ పరిస్థితి చూసి. ఏంటి వీళ్ళ కు ఇంతపిచ్చి? అని. చుట్టుపక్కల  అందరింట్లో ను వస్తుంది  నాన్న మన ఇంట్లోనే రావడం లేదు. అంటూ పిల్లలు ఆరాటం. అవునా ఐతే ఇది మీ అమ్మ పనే అంటూ నావెంట పడ్డారు. ఎంచేసావు అని.
 నేనేం చేయలేదు అన్న కూడా నమ్మడం లేదు. నా నవ్వు తో వాళ్లకు అర్థం అయ్యింది.నాపనే అని. టి.వి.చూడ్డం తోకూడా మనిషి అలసి పోతాడు. కాని ఇది  స్లీపింగ్ పాయిసన్. 

జీవితం లోసగ భాగం నిద్దురకు కాదు టి.వి. కే సరిపోతుంది.  నేను వెలిగి వున్న దీపపు  గ్లాస్ కు పట్టి వున్న మసి ని పుల్ల ప్లస్ చిన్న  పేపర్ తో తీసేదాన్ని 6th  క్లాస్స్ లో. అదే క్లాస్స్ లోనాకుఒకఆలోచనవచ్చింది.మనిషి పళ్ళు ఎగుడు దిగుడు గావున్నప్పుడు బ్రష్  కూడా అల్లాగే వుండాలి కదా అని మా అమ్మను అడిగే  దాన్ని. అలా ఇప్పుడు వస్తున్నై.
 ఆలోచించడానికి టైం లేదు నేటి పిల్లలకు. టి.వి. కంటే నిద్ర బెటర్.టి.వి. నేను మాత్రం పాతపాటలు, హిందీ పాత పాటలు అంటే మాత్రం నాకుప్రాణం. పాతతరం వారితో ఇంటర్వ్యూ లు తప్పకచూస్తాను. 

మా అత్తగారు టి.వి. చూస్తూరోజూ 11 గంటలకు నిద్రపోయేవారు.  ఒక రోజు  కరెంట్ పోయింది .9 గంటలకే నిద్ర పోయారు. 2   గంటల నిద్ర  కరువే కదా rojoo కూడా. అర్థం చేసుకోరూ!
    మా ఇంట్లో మేము "sankranthi" సినిమా లో లాగా వుండేవాళ్ళం.  ఇప్పుడుపిల్లలు అంటుంటారు.మళ్ళ  అట్లా     . ఎప్పుడువుంటాము. అని.   అవి గడిచిపోయిన రోజులు. టి.వి.పుణ్యమా అని అవి మళ్ళీ రావు. రానే  రావు.
లాభాలు చాలా వుంటే వ్రాయండి. తెలుసుకుంటాను. కాని 90 % వుండాలి సుమా.. 
మా ఫ్యామిలీ నుండి మీరుఒక  న్యూస్ వినాల్సి వస్తుంది. మా విడాకులు అని. భార్య టి.వి.అతి పెద్ద రాయి తోబద్దలు కొట్టింది అనే కోపంతో భర్త విడాకులు అని కాని,   భర్త ఎప్పుడూ టి.వి. చూస్తున్నాడు అనే  కోపం తో భార్య విడాకులు అని కాని వింటారేమో.
నా ఆలోచనంతా నాప్రమేయం లేకుండా టి.వి. రాకుండావుండాలి.మెకానిక్ కూడా రావొద్దు. ఎలా ఎలా ఎలా .ఎలా. బుర్ర వేడెక్కుతుంది.  ఎలానో మీరైనా చెప్పండి ప్లీజ్. 
    బ్లాగ్ మిత్రుల ఎంకరేజ్ మెంట్ తోఇప్పుడు జిరాక్స్  షాప్ పెట్టుకొని నడిపిస్తున్నాను.  వారికి నాధన్యవాదాలు. 

15, జులై 2011, శుక్రవారం

*****************బాబోయ్ " దేశం మనదే తేజం మనదే................"

ఇప్పుడే ఒక బ్లాగ్ చూసాను పాప నవ్వు గురించి.   చాలా బాగా రాసారు.  పసిపాపలు మరియు నవ్వించేవారు ఎదురుగా వున్నవారు మాత్రమే బాగా నవ్వగలరు. వంద లో 20 శాతం వారు మాత్రమే మనసారా నవ్వుతారట.  నేను కూడా పెద్దగా నవ్వడం చాల సం. ఐంది.  దీని గురించి ఆలోచించి మా పిల్లలు ఇలా కాకూడదు అని నేనే వాళ్ళని వెంటబడి నవ్వించదలచుకున్నాను. చక్కిలిగిలి తో. తప్పదుకదా. నవ్వించే ఆర్ట్ అందరికీ రాదు కదా!      మా నాన్న బాగా నవ్వించేవారు ( ఈ లోకం లో వుంటే ఎంతో మందిని నవ్వించేవారు).    ఇంకా మా తమ్ముడు కూడా.   వాళ్ళ దగ్గర వుంటే మన మూతి చెవులకు అంటి ఉండాల్సిందే. కడుపునొప్పి లేవాల్సిందే.  

ఇప్పుడు  విడి సంసారాలలో  మాటలు  అనుకోవడాలు తప్పిస్తే  నవ్వుకోవడాలు లు ఎక్కడివి?   ఇలా ఆలోచిస్తుంటే నాకు  ఈ సందర్భం గుర్తుకు వచ్చింది.
  
" దేశం మనదే తేజం మనదే" అనే పాట వింటే నేను పాఆఆఆఆరిపొతాను.  ఎందుకంటే అలాంటి సందర్భం వచ్చింది మరి.

ఆ రోజు 14 వ నవంబర్. జిల్లా స్థాయి డాన్స్ మరియు పాటల పోటీలు. ముందు పాటల పోటీ పెట్టారు. తొందరగా అవుతుందని.  ఒక్కొక్కళ్ళు పాడుతున్నారు.    డాన్స్ కు వేరే స్టేజ్ ను ఏర్పాటు చేసారు. డాన్స్ చేసేవారు మేకప్ తో విసిగిపోతున్నారు.  ముందు వారు ఉత్సాహంగానే చేసారు.  దాదాపు అన్ని క్లాసికల్   వే.   ఈ పోటీలు ఒక టయిం వరకే  భరించగలము(ను).  ఎక్కువ  టయిము ఐతే విసుగు వచ్చేస్తుంది.  అందులో పిల్లలు.  మీకు ఎలావుంటుందో కానీ నాకు ఐతే................ కానీ  ఈసారి మాత్రం నవ్వలేక చచ్చిపోయాను. పాటల పోటి లో.

ఎందుకంటే   స్టేజ్ మీద  ఆ రోజు దేశ భక్తి  పాటల పోటి అని అనగానే మా అమ్మాయి తో పాడించాలని నేను హాల్ కి వచ్చాను. అందరు కుడా వారి వారి తల్లిదండ్రులతో వచ్చారు.

 మైక్ అందించే ఆతను వున్నాడు అక్కడ.  ప్రారంభం లో చాల ఉత్సాహంగా ఇచ్చాడు.( నాకు ట్రాఫ్ఫిక్ కానిస్టేబుల్ గుర్తుకు వచ్చాడు). మైక్ అందించడానికి  చేతులు మారుస్తుంటే అలసిపోయాడని అర్థం ఐంది.   కొంత టయిం వరకు స్టేజ్ కి దూరంగా వున్నవారుకాస్తా  దగ్గరికి రావడం జరిగి, రాను రాను స్టేజ్ ఎక్కడం ప్రారభించారు.   ప్రతి  పది మందిలో ఏడు గురు "దేశం మనదే " పాడుతుంటే   నాకు పారిపోవాలనిపించింది. 

పది మంది పూర్తి చరణాలు పాడారు. రాను రాను చరణాలు తగ్గించారు. చివరికి వచ్చేసరికి పల్లవి మాత్రమే  అనుమతించారు. స్టేజ్ మీద ఉన్నవారికి గాని, కింద కూర్చున్న మాకు గాని ఓపిక లేకపాయింది. ఇంకా  పిల్లలు వచ్చేస్తున్నారు. చివరికి వచ్చేసరికి  మైక్ అతను పల్లవి ఐపోగానే మైక్ ను గుంజుకోవడం చేస్తున్నాడు.   పిల్లలు ఆయన చేతులోంచి గుంజుకోవడం( పట్టి లాగడం), పాడడం ( కాదు కాదు బలవంతంగా చదవడం లాగా మారింది  ) గుంజుకోవడం,  పాడడం ఇలాగే  జరుగుతుంటే  ఇదంతా చూస్తున్న నాకు నవ్వు ఆగడం లేదు.

మైక్ కొన్నిసార్లు కింద పడింది. ఇరిగిపోతుందేమో అనిపించిది నాకు.   అందరికీ పాడాలనే వుంది.  అందరికీ ప్రైజ్ తమకే వస్తుందనే ఆశ.      అందరినీ కంట్రోల్ చేయడం కష్టం ఐంది. లాభంలేదని మెయిన్ ఆఫ్ చేసారు.  జనాలను చూసి ఇక మా అమ్మయికి చాన్స్ రాదనీ పాడించలేదు.    కానీ మైక్ లాక్కొనడం తలచుకుంటే నాకు నవ్వు ఆగదు.
మీకు ఎలాగా వుందో రాస్తారు కదూ బై.

14, జూన్ 2011, మంగళవారం

అత్తగారు చూస్తే ఇంకేమైనా ఉందా

         అన్నీ పరిష్కరించే వాళ్ళు వుంటే జైంట్ ఫ్యామిలీ లో ఎన్ని సం.ఐనా ఉండొచ్చు కదా. మా ఇంట్లోనూ  అలానే మా అత్తగారు, మామగారు అన్నీ పరిష్కరించేవారు. ఎవరినీ నొప్పించకుండా. అందరం వారిని గౌరవించే వారం. 
          ఒక ఉదా.మా ఇల్లు అప్పట్లో అద్దె ఇల్లు. నీళ్ళు సరిపోయేవి కావుఅందరికీ.  వర్షాకాలం లో వర్షం నీళ్ళు పట్టుకొని బాగా తేరుకున్న తర్వాత వడబోసుకొని నిలవ చేసుకొనే వాళ్ళం. మీటర్ రీడింగ్ పొదుపు చేయాలి కదా. చాలా లోతైన  నీళ్ళ ట్యాంక్ లో నింపే వాళ్ళం. ఏదైనా వెస్ట్ కానిచ్చేవాళ్ళం కాము. అత్తగారి దగ్గర చాలా పనులు నేర్చుకున్నాము. 
      ఒక రోజు నేను బాత్రూం లో కూర్చొని మొఖం కడుక్కుంటూవున్నాను. ఎందుకో నాకు ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఈ సబ్బు నీళ్ళల్లో పడితే ఇక అత్తగారు ఎట్లా అరుస్తారో కదా. బాగా తిడతారు.  రోజులో ఇరవై సార్లు అందరికీ చెప్పుతూ వుంటారు.  అనుకుంటూ సబ్బు రాసుకుంటున్నాను. సోప్ ను  గట్టు పై సోప్ కేస్ లో వేసాను. ముఖం రుద్దుతున్నాను. కండ్లు రుద్దుతూ  సోప్ కోసం మళ్ళీ గట్టు మీద చేయి పెట్టాను. దొరకడం లేదు. హమ్మో అనుకున్నా. ఏంటి సోప్ కేస్ ఏది అనుకుంటూ చేయి కదిపాను. లేదు దొరకడం లేదు. కండ్లు గట్టిగా నలుముకొని చూసాను. బాబోయ్ సోపూ లేదు. దాంతోపాటు కేసూ లేదు.నీళ్ళల్లో చూసాను. అది వంకర టింకరగా నీళ్ళల్లోకి నెమ్మదిగా వెలుతూవుంది. దేవుడా.......
         దబ దబా నీళ్ళతో మొఖం కడిగేసినాను.  ఇదేంటి ఇలా ఐంది.  ఇప్పుడు ఎట్లా. నాకు ఏమీ తోచట్లేదు. నీళ్ళు లో సబ్బు కరుగుతూ వుంది. నీళ్ళు తెల్లగా మారుతున్నాయి.ఒక్కసారిగా భయం వేసింది. ఇన్ని నీళ్ళు సబ్బునీల్లుగా మారితే ఇంకేమైనా ఉందా  అనుకుంటూ, ఏంచేయాలి అని వెతుకుతూ వుంటే ఒక సన్న రాడ్ కనబడింది. దాన్ని సబ్బు లోకి కుచ్చాను. ముందు సోప్ తీసాను.తర్వాత కేస్ తీశాను. హమ్మయ్య వచ్చేసింది. దేవుడా ఈసారి 
మొఖం కడిగినప్పుడు సోప్ కేస్ ను నా పక్కనే ఉంచుకుంటాను స్వామీ! హమ్మో హమ్మో. 
     అలా తిట్ల  పర్వం నుండి బయట పడ్డాను. ఇలాంటి సరదా కబుర్లు ఎన్నో ఎన్నెన్నో. ఒక బుక్ రాయొచ్చు. 
కోపాలు, నవ్వులు, పరాచికాలు, అలుగడాలు, మూతిముడుపులు, యాత్రలు, పనులు, చుట్టాలు, ఫంక్షన్లు కదా.
ఒంటరి సంసారం లో భర్త దగ్గరే అన్ని అవతారాలు. సంసారం లో సరిగమలు.
    


9, ఏప్రిల్ 2011, శనివారం

hammo blog

blog ante inta process aa. edo raase print avtadi gada ani anukunnanu. ippudu nenyna  emrastunnano artham kavatledu. idi print avutada leda ani test chestunnanu. telugeeee sarigga radaye ika english em artha avtadi. andulo naalanti slow mentality ki. devuda idi print iyyetattu choodu. kasta pegee lo na peru choosukuntanu. andari bloglu ento bagunnai. nadi etla vuntado.ina nerchukuntunnau kada evvaroo emi anarule. telvaka pote cheptam antaru. chepte nerchukuntanu. lekapote try chestanu. adeekakapote oorukuntanu. intakante em chestanu. habbo entamandi entabaaga rastunnaru. enno vishayalu cheptunnaru. hammo. andariki enta telivithetalu. nenu samudram lo chinna neeti bottu   kadu kadu andulo inka chinnna tumparanu. vunta mari.