28, జూన్ 2012, గురువారం

టి.వి.

                

 టి.వి. వల్ల  వాళ్ళ ఇంట్లో వచ్చిన గొడవలను నాకు ఈరోజు ఒక ఆవిడ చెప్పింది. మనస్థాపాలు.

                 టి.వి లేకుంటే జనాలు ఇంత  చెడిపోయే వారు కాదేమో అనిపిస్తుంది నాకు.  మనలో చాలా మందికి చెడు ఆలోచనలు లేవు.  టి.వి. లేకుంటే  కుటుంబాలు విడిపోవడానికి  ఇంక కొన్ని సం. పట్టేదేమో. తెలుగు లో వచ్చే సీరియల్స్ అన్నీ దాదాపు కుటుంబాన్ని ఎలాగా విడదీయాలో  రకరకాల  ఆలోచనలు  ( అసలు అటువంటివి రావు) రేకెత్తించేలా, ప్రేరేపించేల చేస్తున్నై. ఎవ్వరినైనా, ఏమైన, ఎక్కడైనా అనొచ్చు అనేలా ఉంటున్నాయి. చాలా దారుణంగా వున్నై కొన్ని సీరియల్స్ . నేను  రెగ్యులర్ గా  టి.వి. చూడను.  వంట చేస్తూ మాటలు వింటుంటాను.       ఒక్క పాడుతా తీయగా, హిందీ పాత పాటలు  తప్ప.
                          కుటుంబాలను ఎలా కలపొచ్చో మాత్రం ఎవ్వరికీ అస్సలు తెలవదు లాగా వుంది. ఆ దిశ గా ఎలా మాట్లాడాలో ఎవ్వరూ చెప్పరు. కోపం ,ఆవేశం మొ. అర్ధాలు మాత్రం బాగా తెలుసు. కరుణ, సౌమ్యం , లాలన, ఓపిక అంటే  ఎగిరి పడతారు. చులకనగా చూస్తారు.
                            హిందీ సీరియల్స్ కుటుంబాలు గా ఉండడానికి ఇష్టపడతాయి. ఆ దిశగా సీరియల్స్ ను నడిపిస్తాయి. నాకు నచ్చుతాయి.
                 బై....