15, జులై 2011, శుక్రవారం

*****************బాబోయ్ " దేశం మనదే తేజం మనదే................"

ఇప్పుడే ఒక బ్లాగ్ చూసాను పాప నవ్వు గురించి.   చాలా బాగా రాసారు.  పసిపాపలు మరియు నవ్వించేవారు ఎదురుగా వున్నవారు మాత్రమే బాగా నవ్వగలరు. వంద లో 20 శాతం వారు మాత్రమే మనసారా నవ్వుతారట.  నేను కూడా పెద్దగా నవ్వడం చాల సం. ఐంది.  దీని గురించి ఆలోచించి మా పిల్లలు ఇలా కాకూడదు అని నేనే వాళ్ళని వెంటబడి నవ్వించదలచుకున్నాను. చక్కిలిగిలి తో. తప్పదుకదా. నవ్వించే ఆర్ట్ అందరికీ రాదు కదా!      మా నాన్న బాగా నవ్వించేవారు ( ఈ లోకం లో వుంటే ఎంతో మందిని నవ్వించేవారు).    ఇంకా మా తమ్ముడు కూడా.   వాళ్ళ దగ్గర వుంటే మన మూతి చెవులకు అంటి ఉండాల్సిందే. కడుపునొప్పి లేవాల్సిందే.  

ఇప్పుడు  విడి సంసారాలలో  మాటలు  అనుకోవడాలు తప్పిస్తే  నవ్వుకోవడాలు లు ఎక్కడివి?   ఇలా ఆలోచిస్తుంటే నాకు  ఈ సందర్భం గుర్తుకు వచ్చింది.
  
" దేశం మనదే తేజం మనదే" అనే పాట వింటే నేను పాఆఆఆఆరిపొతాను.  ఎందుకంటే అలాంటి సందర్భం వచ్చింది మరి.

ఆ రోజు 14 వ నవంబర్. జిల్లా స్థాయి డాన్స్ మరియు పాటల పోటీలు. ముందు పాటల పోటీ పెట్టారు. తొందరగా అవుతుందని.  ఒక్కొక్కళ్ళు పాడుతున్నారు.    డాన్స్ కు వేరే స్టేజ్ ను ఏర్పాటు చేసారు. డాన్స్ చేసేవారు మేకప్ తో విసిగిపోతున్నారు.  ముందు వారు ఉత్సాహంగానే చేసారు.  దాదాపు అన్ని క్లాసికల్   వే.   ఈ పోటీలు ఒక టయిం వరకే  భరించగలము(ను).  ఎక్కువ  టయిము ఐతే విసుగు వచ్చేస్తుంది.  అందులో పిల్లలు.  మీకు ఎలావుంటుందో కానీ నాకు ఐతే................ కానీ  ఈసారి మాత్రం నవ్వలేక చచ్చిపోయాను. పాటల పోటి లో.

ఎందుకంటే   స్టేజ్ మీద  ఆ రోజు దేశ భక్తి  పాటల పోటి అని అనగానే మా అమ్మాయి తో పాడించాలని నేను హాల్ కి వచ్చాను. అందరు కుడా వారి వారి తల్లిదండ్రులతో వచ్చారు.

 మైక్ అందించే ఆతను వున్నాడు అక్కడ.  ప్రారంభం లో చాల ఉత్సాహంగా ఇచ్చాడు.( నాకు ట్రాఫ్ఫిక్ కానిస్టేబుల్ గుర్తుకు వచ్చాడు). మైక్ అందించడానికి  చేతులు మారుస్తుంటే అలసిపోయాడని అర్థం ఐంది.   కొంత టయిం వరకు స్టేజ్ కి దూరంగా వున్నవారుకాస్తా  దగ్గరికి రావడం జరిగి, రాను రాను స్టేజ్ ఎక్కడం ప్రారభించారు.   ప్రతి  పది మందిలో ఏడు గురు "దేశం మనదే " పాడుతుంటే   నాకు పారిపోవాలనిపించింది. 

పది మంది పూర్తి చరణాలు పాడారు. రాను రాను చరణాలు తగ్గించారు. చివరికి వచ్చేసరికి పల్లవి మాత్రమే  అనుమతించారు. స్టేజ్ మీద ఉన్నవారికి గాని, కింద కూర్చున్న మాకు గాని ఓపిక లేకపాయింది. ఇంకా  పిల్లలు వచ్చేస్తున్నారు. చివరికి వచ్చేసరికి  మైక్ అతను పల్లవి ఐపోగానే మైక్ ను గుంజుకోవడం చేస్తున్నాడు.   పిల్లలు ఆయన చేతులోంచి గుంజుకోవడం( పట్టి లాగడం), పాడడం ( కాదు కాదు బలవంతంగా చదవడం లాగా మారింది  ) గుంజుకోవడం,  పాడడం ఇలాగే  జరుగుతుంటే  ఇదంతా చూస్తున్న నాకు నవ్వు ఆగడం లేదు.

మైక్ కొన్నిసార్లు కింద పడింది. ఇరిగిపోతుందేమో అనిపించిది నాకు.   అందరికీ పాడాలనే వుంది.  అందరికీ ప్రైజ్ తమకే వస్తుందనే ఆశ.      అందరినీ కంట్రోల్ చేయడం కష్టం ఐంది. లాభంలేదని మెయిన్ ఆఫ్ చేసారు.  జనాలను చూసి ఇక మా అమ్మయికి చాన్స్ రాదనీ పాడించలేదు.    కానీ మైక్ లాక్కొనడం తలచుకుంటే నాకు నవ్వు ఆగదు.
మీకు ఎలాగా వుందో రాస్తారు కదూ బై.