14, జూన్ 2011, మంగళవారం

అత్తగారు చూస్తే ఇంకేమైనా ఉందా

         అన్నీ పరిష్కరించే వాళ్ళు వుంటే జైంట్ ఫ్యామిలీ లో ఎన్ని సం.ఐనా ఉండొచ్చు కదా. మా ఇంట్లోనూ  అలానే మా అత్తగారు, మామగారు అన్నీ పరిష్కరించేవారు. ఎవరినీ నొప్పించకుండా. అందరం వారిని గౌరవించే వారం. 
          ఒక ఉదా.మా ఇల్లు అప్పట్లో అద్దె ఇల్లు. నీళ్ళు సరిపోయేవి కావుఅందరికీ.  వర్షాకాలం లో వర్షం నీళ్ళు పట్టుకొని బాగా తేరుకున్న తర్వాత వడబోసుకొని నిలవ చేసుకొనే వాళ్ళం. మీటర్ రీడింగ్ పొదుపు చేయాలి కదా. చాలా లోతైన  నీళ్ళ ట్యాంక్ లో నింపే వాళ్ళం. ఏదైనా వెస్ట్ కానిచ్చేవాళ్ళం కాము. అత్తగారి దగ్గర చాలా పనులు నేర్చుకున్నాము. 
      ఒక రోజు నేను బాత్రూం లో కూర్చొని మొఖం కడుక్కుంటూవున్నాను. ఎందుకో నాకు ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఈ సబ్బు నీళ్ళల్లో పడితే ఇక అత్తగారు ఎట్లా అరుస్తారో కదా. బాగా తిడతారు.  రోజులో ఇరవై సార్లు అందరికీ చెప్పుతూ వుంటారు.  అనుకుంటూ సబ్బు రాసుకుంటున్నాను. సోప్ ను  గట్టు పై సోప్ కేస్ లో వేసాను. ముఖం రుద్దుతున్నాను. కండ్లు రుద్దుతూ  సోప్ కోసం మళ్ళీ గట్టు మీద చేయి పెట్టాను. దొరకడం లేదు. హమ్మో అనుకున్నా. ఏంటి సోప్ కేస్ ఏది అనుకుంటూ చేయి కదిపాను. లేదు దొరకడం లేదు. కండ్లు గట్టిగా నలుముకొని చూసాను. బాబోయ్ సోపూ లేదు. దాంతోపాటు కేసూ లేదు.నీళ్ళల్లో చూసాను. అది వంకర టింకరగా నీళ్ళల్లోకి నెమ్మదిగా వెలుతూవుంది. దేవుడా.......
         దబ దబా నీళ్ళతో మొఖం కడిగేసినాను.  ఇదేంటి ఇలా ఐంది.  ఇప్పుడు ఎట్లా. నాకు ఏమీ తోచట్లేదు. నీళ్ళు లో సబ్బు కరుగుతూ వుంది. నీళ్ళు తెల్లగా మారుతున్నాయి.ఒక్కసారిగా భయం వేసింది. ఇన్ని నీళ్ళు సబ్బునీల్లుగా మారితే ఇంకేమైనా ఉందా  అనుకుంటూ, ఏంచేయాలి అని వెతుకుతూ వుంటే ఒక సన్న రాడ్ కనబడింది. దాన్ని సబ్బు లోకి కుచ్చాను. ముందు సోప్ తీసాను.తర్వాత కేస్ తీశాను. హమ్మయ్య వచ్చేసింది. దేవుడా ఈసారి 
మొఖం కడిగినప్పుడు సోప్ కేస్ ను నా పక్కనే ఉంచుకుంటాను స్వామీ! హమ్మో హమ్మో. 
     అలా తిట్ల  పర్వం నుండి బయట పడ్డాను. ఇలాంటి సరదా కబుర్లు ఎన్నో ఎన్నెన్నో. ఒక బుక్ రాయొచ్చు. 
కోపాలు, నవ్వులు, పరాచికాలు, అలుగడాలు, మూతిముడుపులు, యాత్రలు, పనులు, చుట్టాలు, ఫంక్షన్లు కదా.
ఒంటరి సంసారం లో భర్త దగ్గరే అన్ని అవతారాలు. సంసారం లో సరిగమలు.