21, అక్టోబర్ 2011, శుక్రవారం

నానానానానానానానానానానానానానానా...............................రోడియో

నేను కొత్తగా  పెట్టిన  జిరాక్స్ షాప్  లో  కూర్చున్నాను. ఎదురుగా నా మెరూన్ రోడియో. ముద్దొస్తుంది. ఏ పరిస్థితులలో కొన్నాను? ఎన్ని రోజులకు కొన్నాను? ఎంత కష్టం అనుభవించాను?  నాకే తెలుసు. క్లుప్తంగా.....
         కాలేజ్ కి రోజూ ఆటోలో  వెళ్లి నడిచి  వచ్చేదాన్ని. ఒక పూట ఖర్చు ఆదా అని. ఆడ వాళ్లకి ఇదో పెద్ద రోగం. 1  రూపాయ  కూడా ఆదా కావాలనే కోరుకుంటాము. "కావాలంటే ఆటో డబ్బులు ఇస్తాను కాని. నన్ను మాత్రం దించమనకు అంటారు." మా వారు.
         ఇట్లా అంటారా అని తెగించి పోనూ, రానూ ఆటో లో తిరిగాను. ఐనా  ఆటో అతనికి రోజూ 40 రూపాయలు ఇవ్వడం నాకు అస్సలు నచ్చలే. స్కూటీ మీద వెళ్ళే ఆడవాళ్ళని చూస్తుటే నాకు ఎప్పుడు బండి కొంటానో. ఎప్పుడు కాలేజ్ కి వెళ్తానో........
            "ఏమండీ నాకు బండి కొనివ్వరా! ప్లీజ్ "  అన్నాను. "ముందు బండి ఎట్లా నడపాలో నేర్చుకో తర్వాత కొనిస్తాను."  అన్నారు. హమ్మయ్య కొనిస్తాను అని ఐతే అన్నారు అని సంతోషపడ్డాను. . "మరి నేర్పించడానికి బండి ఎవరు ఇస్తారు అండీ?" అన్నాను. "ఏమో అదంతా నాకు తెలవదు"  అన్నారు. 
         ఇక బండి ఎవరు ఇస్తారు అని వెదుకులాట. ఐనా ఎవరైనా నేర్చుకోవడాని కి ఎందుకిస్తారు? చెడిపోదా? నేనైతే ఇస్తానా? ( ఇచ్చి మోసపోయాను. మొహమాటం కదా. అది వేరే కథ ).
ఐనా ఒక మంచి ఫ్రెండ్ నాకు ఇచ్చింది. నాకు బాలన్స్ చేయడం రాక నేర్చుకోలేకపోయాను. హతవిధీ ఎలా ఎలా  ఎలా....
          నేను కొనే నా బండి తోనే నేర్చుకుంటాను అది ఎన్ని  నెలలైనా సరే అనుకున్నాను. "బండి ఎలా బాలన్స్ చేస్తావు? మోయలేవు."  అనేసరికి "ఏమండీ హెలికాప్టర్ నడిపేవారు దాన్ని మోస్తారా?" అన్నాను. "ఏమో చిన్నీ ఇక నీ ఇష్టం" అన్నారు. 
       పిల్లలు ఏదైనా తెమ్మంటే ఆటో లేదా నడిచి. నాకు విసుగు వచ్చేసింది. నా వాలకం చూసి అందరూ  ఏంటి అస్థిపంజరం లాగా అయ్యావు? అనడం మొదలుపెట్టారు. అమ్మ నా అవస్థ గమనించి డబ్బులు నేను కొన్ని పెట్టుకుంటాను ఏదైనా బండి కొనుక్కో అంది. చాలా రోజులు ఆలోచించాను. అదనంగా ఖర్చు అనుకున్నాను. కాని నేను పడే ఇబ్బందులముందు అవి చిన్నవిగా కనపడ్డాయి. 
          ఇక బండి కోసం.   ఏది కొనాలి.     ఎంతలో కొనాలి. ఎన్నో  రకాల వెహికిల్స్ చూసాను. మధ్యతరగతి కదా. చాలా ఆలోచించాల్సి వచ్చింది. మొత్తానికి రోడియో కొన్నాను. డబ్బులు ఎక్కువే అయ్యాయి.  షేరింగ్ కదా.  కొన్నాను. 15 రోజులు బండి ఇంట్లోనే పెట్టాను. మా వారు ఆఫీస్ బిజీ.         వెనుక కూర్చొని బాలన్స్ చేసే మగవారు ఎవరుంటారు?  స్టార్ట్ చేసిన బండిని పట్టుకోనేసరికి చేతులు వణికాయి. ఫస్ట్ టైం కదా. అలానే  2  రోజులు స్టాండింగ్ లో వుంచి స్టార్ట్  ప్రాక్టీస్ చేసాను. కాస్త భయం పోయింది. తర్వాత స్టాండ్ తీసివేసి బాలన్స్ చేసాను. హమ్మో ఎంత బరువో.
                  తర్వాత బయటికి తీసుకు వెళ్లి బ్రేక్ వేస్తూ ముందుకు ఫీట్ ఫీట్ మెల్లగా వెళ్ళాను. అప్పటికి 5 రోజులు ఐంది. సిమెంట్ రోడ్డు. తల పగులుతదేమో అని భయం. అలాగే ప్రాక్టీస్ చేసాను. ఇటు నుండి అటు. మళ్ళి కిందికి దిగి టర్న్ చేసి అటు నుండి ఇటు. నాకు డ్రైవింగ్ రానట్టే వుంది. భగవాన్ అనుకున్నాను.  కాని ఏదో తెగింపు మళ్ళీ. 
               ఒక రోజు మా ఆయనకు తీరికయ్యింది  ఎట్లనో..... "పద నేర్పిస్తాను" అన్నారు. వెనుక కూర్చున్నారు. స్టార్ట్ చేసాను. "కానీ ఎక్స్లేటర్ తిప్పు అన్నారు. "  చిన్నగా తిప్పానేమో  బండి ముందుకు పోలేదు. ఇంకా తిప్పాను. ముందుకు ఉరికింది. " వామ్మ్మోవాయ్యో" అంటూ మొత్తుకున్నాను. ఆయన బాలన్స్ చేసారు.         తీసుకెళ్ల లేక పోయాను. హాండిల్  అటు ఇటు వంకర టింకరగా  కదుల్తుంది. చేతులు, కాళ్ళు గజ గాజా వణుకుతున్నాయి  "వామ్మో దిగండి నా వల్ల కాదు బాబోయ్"   అన్నాను.     దేవుడా.......దేవుడా ......ఏంటయ్యా ఇలా జరుగుతుంది?.......
                "ఇక నీకు రాదు. ఇట్లా భయపడితే ఎట్లా" అన్నారు. "ఏం కాదు నాకు వస్తది.  నేను మిమ్మల్ని ఆఫీస్ కి డ్రాప్ చేసే రోజు తప్పక వస్తది." అన్నాను. "ఇట్లా భయ పడితే ఎన్ని నెలలకైనా నీకు రాదు" అన్నారు. "దేవుడా ఇంత దాక వచ్చినాక నాకీ పరీక్ష ఏంటి స్వామీ. తొందరగా నాకు డ్రైవింగ్  వచ్చేటట్టు చేయి స్వామీ" అని దండం  పెట్టు కున్నాను. 
          "ఒక రోజు నన్ను మా  కాలేజ్ కి నైట్ 9  కి తీసుకెళ్ల మని పోరు పెట్టాను. అక్కడ  నేర్చుకుంటాను" అన్నాను. "అక్కడికి ఎందుకు చిన్నీ? అందరూ వుంటారు అక్కడ" అన్నారు. "రాత్రి  ఎవ్వరూ వుండరు వేల్దామండీ " అన్నాను నామాట విని తీసుకెళ్ళారు.  ఆహా . నా కోరిక తీరింది.  పేద్ద గ్రవుండు. టర్నింగ్ లు   వుండవు.  చుట్టూరా తిరగొచ్చు.
అదీ నా ప్లాన్.   నా భయం పోయింది.  నేను అనుకున్నది జరిగింది. 
"ఏమండి నావెనుక  కూర్చోండి"  అన్నాను.
" ఏంటే అంత ధైర్యం వచ్చింది నీకు.  మీ కాలేజ్ కి రాగానే " అన్నారు. 
"ఏమనుకున్నారు మరి" అన్నాను.
కాళ్ళు వేలాదదీయమన్నాను. నేను కూడా అలాగే వేలాడదీసి   తిన్నగా కొంచం దూరం పోగానే కాళ్ళు పైకి పెట్టేసి నా ఇష్టం వచ్చినన్ని రౌండ్లు కొట్టాను. మా వారు కూడా "పెట్రోల్  పోయించాను నీ ఇష్టం వచ్చినన్ని సార్లు తిరుగు ఇక" అన్నారు. ఆహా గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అనుకుంటూ ఝామ్మని తిరుగుతూనే వున్నాను.  హుర్ర వచ్చేసింది.   వచ్చేసింది.    వచ్చేసింది.
కాలేజ్ కి వెళ్తుంటే                ఒహో 
              అలా బండి కొనడం, తిరగడం అవసరాలు  తీర్చుకొనడం, పిల్లలను స్కూల్లో దించి  రావడం బాక్స్ లు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో.  మా వారు  అప్పుడప్పుడు నన్ను డ్రాప్ చేసే పని కూడా తప్పించుకున్నారు. 

నా రోడియో ఐ లవ్ యు .